మేధా పాట్కర్ అరెస్ట్
‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమ కారిణి, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ అరెస్ట్ అయ్యారు. 2000 సంవత్సరంలో ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పెట్టిన పరువు నష్టం కేసులో ప్రొబేషన్ బాండ్లను సమర్పించినందుకు కోర్టు ఆమెపై రెండు రోజుల క్రితం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఇవాళ ఆమెను ఇవాళ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాముద్దీన్ లోని ఆమె నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లుగా సౌత్ ఈస్ట్ డీసీపీ రవికుమార్ సింగ్ తెలిపారు.

