మేడారం అభివృద్ధి పనులు సమయానికి పూర్తి చేయాలి
మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం మేడారం అభివృద్ధి పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అభివృద్ధి పనుల్లో ఆచార–సంప్రదాయాలు, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి అని సీఎం స్పష్టం చేశారు. ఏవైనా పొరపాట్లు చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాతిపనులు, రహదారులు, గద్దెల చుట్టూ రాకపోకల మార్గాలు, భక్తులు వేచి ఉండే ప్రాంతాలు వంటి ప్రతి అంశంపై సీఎం ప్రత్యేక సూచనలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైన అన్ని సౌకర్యాలను సమయానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

