ఇంతలో ఎంత మార్పు, మారిన రెండు పార్టీల కథ
తొలి ఫలితాల్లో కాంగ్రెస్ వెనుకపడినప్పటికీ, ప్రస్తుతం బీజేపీ దూసుకుపోవడంతో రెండు పార్టీల కార్యాలయాల్లో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ కంటే బీజేపీ ముందుకు సాగడంతో, మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇంకా పలు రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది. బీజేపీ గ్రాఫ్ ఇంకా పెరుగుతుందో, తగ్గుతుందో చూడాలి. 90 స్థానాలకు గాను 49 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముందుగానే సంబరాలు ప్రారంభించిన కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ కంటే 9 సీట్లు వెనుకబడింది. ఉదయం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కార్యాలయంలో క్రాకర్లు పేల్చి, జిలేబీలు పంపిణీ చేశారు. ఆ తర్వాత రౌండ్లలో బీజేపీ దూకుడుతో ఆ పార్టీలో హుషారు పెరిగింది. మీడియా సిబ్బందికి లడ్డూలు తెప్పించి, బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.