ప్రతి ఊరిలో మీ సేవా కేంద్రం.. మహిళా సంఘాలకు కేటాయింపు
టిజి: ప్రతి ఊరీలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని కేటాయించనుంది. ఇందుకోసం రూ.2.50 లక్షల రుణాన్ని వారికి అందించనుంది. ఇంటర్ పాసైన విద్యార్థులను, మహిళలను మీ సేవ ఆపరేటర్లుగా ఎంపిక చేయనుంది. వారికి నెలపాటు శిక్షణ ఇచ్చి ఆగస్టు 15 లోగా ప్రారంభించనుంది. గ్రామ పంచాయతీ, అంగన్‌వాడి, ప్రభుత్వ పాఠశాల, ఇతర భవనాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.