Home Page SliderNational

ఎంబీబీఎస్ ఫెయిలైన వ్యక్తి ట్రీట్ మెంట్.. హార్ట్ పేషెంట్ మృతి

ఎంబీబీఎస్ ఫెయిలైన ఓ వ్యక్తితో రోగికి గుండెకు సంబంధించిన ట్రీట్ మెంట్ చేయడంతో ఆ పేషెంట్ చనిపోయాడు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ కుమార్ అనే పేషెంట్ కొద్ది రోజులుగా గుండె నొప్పి, ఊపిరి సరిగా రాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆయనను కోజికోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు చికిత్స అందించిన కాసేపటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అర్హత లేని డాక్టర్లు ఆస్పత్రిలో పని చేస్తున్నారని మృతుడి కుమారుడు అశ్విన్ కు సమాచారం అందింది. ఈ విషయమై వైద్య సిబ్బందిని ప్రశ్నించగా వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆస్పత్రిల్లో వైద్యుడిగా పని చేస్తున్న అబూ అబ్రహం లూక్ 2011లో ఎంబీబీఎస్ లో జాయిన్ అవ్వగా, గత 12 ఏండ్లుగా ఆయన సెకండ్ ఇయర్ కూడా పాసవ్వలేదని గుర్తించారు. నిందితుడు లూక్ ను అరెస్ట్ చేశారు. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంవో)ను సైతం అదుపులోకి తీసుకున్నారు.