తల్లిదండ్రులు కాబోతున్న మౌనిక,మంచుమనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితురాలు మౌనికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాను తల్లిదండ్రులం కాబోతున్నామంటూ తన అభిమానులకు శుభవార్తను చెప్తూ ట్విటర్‌లో పంచుకున్నాడు. మోహన్ బాబు వారసునిగా మంచు విష్ణు, మనోజ్‌లు చిత్రాలతో బాగానే ఆకట్టుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలలో ఎక్కువగా మనోజ్ కనిపించడం లేదు. అతనికి మౌనికతో రెండవ వివాహం జరిగింది. 2015లో ప్రణతీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలోనే మౌనికను వివాహం చేసుకున్నారు. అయితే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె అయిన మౌనికకు కూడా ఇది రెండవ వివాహమే. ఆమెకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. వారి కుటుంబంలోకి బుజ్జాయి రాబోతున్నట్లు ట్వీట్ చేశారు హీరో మనోజ్.
