Andhra PradeshHome Page Slider

“మట్టి వినాయకులనే పూజించాలి”:ఏపీ డిప్యూటీ సీఎం

మరికొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గణేశ్ చతుర్థి నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యావరణహితమైన మట్టి వినాయకులనే పూజించాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు  ఏపీలో మట్టి వినాయకులనే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పవన్ అధికారులకు సూచించారు. కాగా తన సొంత నియోజకవర్గం  పిఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాలనే పూజించేలా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.