ఫుల్ స్వింగ్‌లో మట్కా..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “ఆపరేషన్ వాలెంటైన్” అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఇక దీనితో ఈ సినిమా తర్వాత తాను చేస్తున్న భారీ చిత్రం “మట్కా” పైనే అన్ని ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఇప్పుడు తెరకెక్కుతోంది. అయితే భారీ సెట్టింగ్స్‌లో రీసెంట్‌గా రామోజీ ఫిలిం సిటీలో కీలక షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ షూట్ తర్వాత వెంటనే మేకర్స్ వైజాగ్‌కి షిఫ్ట్ అవుతారన్నట్టు తెలుస్తోంది. అక్కడ కీలక సన్నివేశాలతో షెడ్యూల్ ముగిస్తారు. ఇలా మొత్తానికి షూట్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా వచ్చిన ఓ పోస్టర్‌లో అయితే బాలీవుడ్ నటి నోరా ఫతేహి స్టన్నింగ్‌గా ఉందని చెప్పాలి. ఒక పబ్ సెట్‌లో ఆమె కనిపిస్తుండగా సాలిడ్ సాంగ్‌ని మేకర్స్ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.