తెలంగాణలో భారీగా జిల్లా కలెక్టర్ల బదిలీలు
తెలంగాణలో తాజాగా 20 మంది ఐఏఎస్‌ల బదిలీలు జరుగుతున్నాయి. 20 మంది అధికారులకు బదిలీలు చేస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి కలెక్టరుగా కోయ శ్రీహర్ష, సిరిసిల్ల కలెక్టరుగా సందీప్ కుమార్ ఝూ, నాగర్ కర్నూల్- బదావత్ సంతోష్, కరీంనగర్ కలెక్టరుగా అనురాగ్ జయంతి, నారాయణపేట కలెక్టరుగా సిక్తా పట్నాయక్, భద్రాద్రి లో జితేశ్ వి పాటిల్ నియమింపబడ్డారు.

