ఎస్ బీఐ ఏటీఎంలో భారీ చోరీ..
తెలంగాణ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు చొరబడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలోకి ప్రవేశించి రూ.20 లక్షల నగదును అపహరించారు. అనంతరం నిప్పంటించడంతో ఏటీఎం పూర్తిగా కాలిపోయింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

