Home Page SliderTelangana

టాలీవుడ్ హీరో ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో నటుడు విశ్వక్‌ సేన్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 2 లక్షల రూపాయల విలువైన డైమండ్‌ రింగ్ అపహరణ గురైనట్లు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీకెమెరాలో గేట్‌ ఎదుట గుర్తు తెలియని వ్యక్తి బైక్‌ గుర్తించారు. తెల్లవారుజామున చోరీ జరిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే.. ఆ దొంగ కేవలం 20నిమిషాల్లోనే చోరీ పూర్తి చేసి, అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు నిర్ధారించారు.