బీదర్ లో భారీ దోపిడీ.. హైదరాబాద్ లో కాల్పులు
హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ లో కాల్పుల కలకలం రేగింది. నిన్న ఉదయం బీదర్ లో భారీ దోపిడి చేసిన ముఠాను బీదర్ నుంచి హైదరాబాద్ వరకు పోలీసులు ఫాలో అవుతున్నారు. బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. ట్రావెల్ బస్సు క్లీనర్ పై కూడా దుండగులు దాడి చేశారు. బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు.
దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

