Home Page SliderNational

దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా రిక్రూట్‌మెంట్లు

దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం 4,451 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. దీనికోసం రెండు భారీ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 3049 బ్యాంకు పీవోలు (ప్రొబేషనరీ ఆఫీసర్స్), 1402 వివిధ విభాగాలలోని స్పెషలిస్టు పోస్టులు వంటి వాటికి  అప్లయ్ చేసుకోవచ్చు.

ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు అర్హులు. వీరి వయస్సు ఆగస్టు 1, 2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. డిసెంబర్‌లో కాల్ లెటర్లు ఇస్తారు. డిసెంబర్ 30, 30 తేదీలలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. జనవరిలో ఈ పరీక్ష ఫలితాలు వెల్లడి చేస్తారు. అనంతరం మొయిన్స్ పరీక్షలు 2024 జనవరిలో జరుగుతాయి. ఇంటర్యూలు మార్చిలో పూర్తి చేసి, ఏప్రిల్ నాటికి నియామకాలు పూర్తి చేస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు బ్యాంకులలో ఈ రిక్రూట్‌మెంట్ ఆధారంగా ఖాళీలు భర్తీ చేస్తారు.