సౌత్‌కొరియాలో శాంసంగ్ ఉద్యోగుల భారీ నిరసన
సౌత్‌కొరియాలోని శాంసంగ్ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. కాగా ఉద్యోగులు వారి జీతాలు పెంచాలని శాంసంగ్ చరిత్రలోనే అతి పెద్ద నిరసనకు తెరతీశారు.కాగా ఉద్యోగులు వారి జీతాలు పెంచాలని కంపెనీతో చర్చలు జరిపారు.అయితే ఈ చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 6,500 శాంసంగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి 3 రోజులు సమ్మెకు దిగారు. కాగా వారు కంపెనీకి వచ్చే అదనపు లాభాల్లో నుంచి తమకు రావాల్సిన బోనస్ తక్షణమే ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా ఏడాదికి ఒకరోజు అదనపు సెలవు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉద్యోగుల భారీ నిరసనపై శాంసంగ్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించకపోవడం గమరార్హం.