Home Page SliderNational

భారీ ప్రాజెక్ట్-తేజ సజ్జ “మిరాయ్”

టాలీవుడ్ ఆడియెన్స్‌లో గట్టిగా వైరల్ అవుతున్న పేరు “ఇంద్ర”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా మూమెంట్స్ మరోసారి ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి. మరి నిన్న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమాని రీ-రిలీజ్ చేయగా సినిమాతో పాటుగా ఆ సినిమాలో చిరంజీవికి చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన బాల్యనటుడు తేజ సజ్జ పేరు కూడా గట్టిగా వినిపించింది. మరి ఈ నెక్స్ట్ డే ఆగస్టు 23నే తేజ బర్త్ డే కావడం మరో విశేషం. ఈరోజు తన నెక్స్ట్ భారీ చిత్రం “మిరాయ్” నుండి మేకర్స్ క్రేజీ అప్‌డేట్‌ని అందిస్తున్నట్టుగా టైమ్‌ని లాక్ చేశారు. ఆల్రెడీ టీజర్‌తో హాలీవుడ్ ధీటు విజువల్స్‌ని చూపించిన యంగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ని అయితే తేజ సజ్జ బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఇందులో తేజ సజ్జపై గ్రాండ్ సీక్వెన్స్‌ని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది.

తమ ప్రపంచంలో ఏదో డిజాస్టర్ జరిగిన సమయంలో ఒక రాడ్‌ని పట్టుకుని కనిపిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్ మాత్రం మరింత ఆసక్తిని పెంచింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి కూడా హనుమాన్ సంగీత దర్శకుడు గౌర హరీష్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం చేపట్టారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమౌతోంది. ఈ సినిమా 2డి సహా 3డి లో వరల్డ్ వైడ్‌గా మొత్తం 7 భాషల్లో విడుదలకి సిద్ధం చేస్తున్నారు.