Andhra PradeshHome Page Slider

సెజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఒక ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎసెన్షియా అనే కంపెనీలో నేటి మధ్యాహ్నం రియాక్టర్ పేలింది. భోజన విరామ సమయం కావడంతో భారీ ప్రాణ నష్టం కలుగలేదు. కానీ 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని కార్మికులను కాపాడుతున్నారు. దీనిపై హోం మంత్రి అనిత స్పందించి, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపించాలని, క్షత్రగాత్రులకు వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ అచ్యుతాపురం సెజ్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.