ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. రోబోతో రెస్క్యూ ఆపరేషన్
హైదరాబాద్ పాతబస్తీలోని మహారాజ్ గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బిల్డింగ్ లో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోదాంకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్నిప్రమాదంలో పది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఆ ఏడుగురిలో నెల వయసు గల చిన్నారి కూడా ఉంది. బ్రాండో లిఫ్ట్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది చేపట్టింది. మొట్ట మొదటిసారిగా రెస్క్యూ ఆపరేషన్ కోసం రోబో సేవలను వినియోగించింది.