అబిడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకోఠిలోని (బొగ్గులకుంట) హోల్సేల్ క్రాకర్స్ దుకాణంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. 4 ఫైరింజన్ల సాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఒకరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు క్రాకర్స్ దుకాణంలోనూ చాలామంది ఉన్నారు. వారు ఒకరినొకరు తోసుకుంటూ బయటకు వచ్చారు. ఈ ఘటనలో పదికి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.