Home Page SliderTelangana

భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఫ్లాట్

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపల్ పరిధిలోని పుప్పాలగూడలో ఉన్న గోల్డెన్ ఓరియల్ అపార్ట్ మెంట్లో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం అయింది. దీంతో అపార్ట్ మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బింది వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఫ్లాటు, అందులోని సామగ్రి కాలి బూదిదయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది.