ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ చెప్పుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 10 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 20 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగింది. మరికొంత మంది మంటల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఓ చెప్పుల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినట్లు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.