Home Page SliderTelangana

పార్క్ హయత్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెం. 2 లో ఉన్న పార్క్ హయత్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో హోటల్ లో ఉన్న టూరిస్టులు సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలకు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హోటల్ లోని మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ వెంకన్న తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ఆస్తి నష్టం జరిగినట్లుగా పేర్కొన్నారు.