క్రాకర్స్ తయారీలో భారీ పేలుడు- ఏడుగురు మృతి
బాణాసంచా (క్రాకర్స్) తయారుచేసే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. వెస్ట్ బెంగాల్‌లోని తూర్పు మెదినీపూర్ జిల్లాలో ఖాదికుల్ అనే గ్రామంలో బాణాసంచా తయారుచేసే పరిశ్రమలో తీవ్రవిషాదం జరిగింది. హఠాత్తుగా భారీ పేలుడు జరగడంతో ఏడుగురు కార్మికులు అక్కడి కక్కడే మరణించారు. మరికొంతమంది తీవ్రగాయాలపాలయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని, మంటలను అదుపు చేశారు. హుటాహుటిన గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ కర్మాగారం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిదని, బాంబుల తయారీ వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

