సింగరేణి బొగ్గు గనిలో భారీ పేలుడు.. పలువురికి గాయాలు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీ2 బొగ్గు గనిలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి చుట్టు పక్కల ఉన్న నాగేపల్లి, లద్నాపూర్, ఆదివారం పేట, రాజాపూర్, పన్నూరు గ్రామాల్లో భూమి కంపించి, ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇండ్లపై రాళ్లు ఎగిరిపడి పలువురికి గాయాలయ్యాయి. బ్లాస్టింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని, బాధితులకు నష్ట పరిహారం అందజేయాలని ప్రజలు నిరసన తెలిపారు.