గుజరాత్‌లో భారీ పేలుడు..21 మంది మృతి
గుజరాత్‌లోని బనాస్ కాంఠా జిల్లాలో దిసా అనే పట్టణంలో భారీ పేలుడు కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయాలు. ఒక బాణసంచా గిడ్డంగిలో పేలుడు సంభవించింది. దానితో క్షణాల్లో ఆ ప్రాంతమంతా అగ్నికి ఆహుతయ్యింది. పై కప్పు కూడా కూలిపోయింది. దీనితో వారి కుటుంబసభ్యులు, కూలీలు ఈ మంటల్లో చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో 21 మంది మృతి చెందగా, వారిలో 5గురు చిన్నారులు కూడా ఉన్నారు. బాణసంచాను అక్రమంగా తయారు చేసి, నిల్వ చేయడమే ఈ పేలుడుకు కారణమని అధికారులు తెలిపారు. బాధితులలో అనేకులు మధ్యప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు. గిడ్డంగి యజమానిని అరెస్టు చేశారు.