Home Page SliderNational

మాస్ మహారాజ్ హెల్త్‌ ఓకే

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ నెల 15న విడుదలైన చిత్రం “మిస్టర్ బచ్చన్” రిలీజైన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం అనుకున్న అంచనాలు, కలెక్షన్ల రూపంలో అంత ఎక్కువగా రాబట్టలేకపోయింది. ఈ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న 75వ చిత్రం షూటింగ్‌లో తాను తీవ్రగాయాల పాలు అయినట్టుగా వార్తలు బయటకి వచ్చాయి. అలాగే దీంతో పాటుగా ఒక షాకింగ్ పిక్ కూడా వైరల్‌ అయ్యింది. రవితేజ నుండే తన హెల్త్ అప్‌డేట్ బులిటెన్ రావడం విశేషం. తన సోషల్ మీడియాలో రవితేజ పోస్ట్ పెడుతూ ఒక చిన్న సర్జరీ చేయించుకుని కోలుకుని డిశ్చార్జ్ అయ్యాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను, మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ అందించినందుకు నాకు మిక్కిలి సంతోషంగా ఉంది. మళ్ళీ తొందరలోనే ఫ్యాన్స్‌ని కలుసుకునేందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నాను అంటూ రవితేజ తన అభిమానులకి తానే స్వయంగా అప్‌డేట్‌ని అందించారు. దీంతో ఇప్పుడు అభిమానులు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. మరి మాస్ మహారాజ్ త్వరలోనే కోలుకొని మళ్ళీ తన షెడ్యుూల్ ప్రకారం సినిమాలు చేయాలనీ ఆశిద్దాం.