Home Page SliderTelangana

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధిపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రామునూర్‌ లో జరిగింది. రామునూర్‌ కు చెందిన ప్రసన్న లక్ష్మీ, భర్త తిరుపతి, అత్తమామల వరకట్న వేధింపులు భరించలేక జగిత్యాల పోచమ్మవాడలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. కొడుకు పుట్టడంతో ప్రసన్న లక్షీ జాబ్ మానేసింది. ఆమె కుమారుడిని తల్లిదండ్రులు పెంచాలని ప్రసన్న లక్షీ అద్దంపై రాసింది. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.