సీఎం వస్తేనే పెళ్లి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ మొండిపట్టు పట్టాడో అభిమాని. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండ అనే గ్రామానికి చెందిన భూక్య గణేష్ అనే యువకుడు మార్చి 6న నిశ్చితార్థం చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న గణేష్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎంతో అభిమానం. తన పెళ్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కూడా వచ్చేలా చూడాలంటూ వైరా నియోజక వర్గ ఎమ్మెల్యే రామ్‌దాస్ నాయక్‌కు వినతి పత్రం అందించడం వైరల్‌గా మారింది. ఈ విషయంపై రేవంత్ రెడ్డి స్పందన తెలియాల్సి ఉంది.