ఎంపీతో క్రికెటర్ పెళ్లి..నిజమే..
టీమ్ ఇండియా క్రికెటర్ రింకూ సింగ్, పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ ప్రియా సరోజ్‌ను వివాహం చేసుకుంటున్నారంటూ వచ్చిన వార్తలు నిజమేనని ప్రియ తండ్రి పేర్కొన్నారు. ఇటీవల ఈ వార్తలను ఖండించిన ప్రియ తండ్రి ఎమ్మెల్యే తుఫాని సరోజ్, అప్పుడు కేవలం పెళ్లి చర్చలు జరుగుతున్నాయని, ఇంకా నిశ్చితార్థం జరగలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ వివాహానికి ఇరువైపుల పెద్దలు అంగీకరించారని, త్వరలో వీరి నిశ్చితార్థానికి, వివాహానికి ముహుర్తాలు చూస్తామని స్పష్టం చేశారు. వారిద్దరికీ ఏడాది నుండి పరిచయం ఉందని, ఒకరినొకరు ఇష్టపడ్డారని తెలియజేశారు. లక్నోలో వీరి నిశ్చితార్థం ఉంటుందని చెప్పారు. 25ఏళ్ల యువ ఎంపీ ప్రియ గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ఇప్పుడు మచలీ షహర్ నుండి సమాజ్ వాదీ పార్టీ తరపున పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.