InternationalNews

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాల నుంచి కోలుకున్నాయి. ఉదయం బలహీనంగానే ప్రారంభమైన మార్కెట్లు.. మధ్యాహ్నానికి గాడిలో పడ్డాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ… యూరోపియన్‌ మార్కెట్లు లాభాల్లో ఉండటం మన మార్కెట్లకు కలిసొచ్చింది.  సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టాల నుంచి ఏకంగా 900 పాయింట్ల మేర పెరగడం విశేషం. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీలు 0.8 శాతం మేర రాణించాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 257 పాయింట్లు లాభపడి 59,031కి చేరుకుంది. నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుని 17,578కి పెరిగింది.