NationalNews

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

ఈ రోజు స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 48 పాయింట్లు కోల్పోయి 59, 196 పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 17,655 వద్ద స్థిరపడింది. భారతి ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, రిలయన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభాలను ఆర్జించాయి. బజాజ్ ఫిన్ సర్వ్, కొటక్ బ్యాంక్, హిందూస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ నష్టాల బాట పట్టాయి.