Home Page SliderNational

నష్టాల్లో మార్కెట్..

వరుసగా ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్ కు నష్టాలు తప్పలేదు. అమ్మకాల ఒత్తిడి ఇవాళ కూడా కనిపించింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాల్లో ఇన్వెసర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్ సూచీలపై ప్రభావం పడింది. సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 77,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,532 వద్ద స్థిరపడింది.