Andhra PradeshBreaking NewsNews

కొత్త జిల్లాగా మార్కాపురం !

అమరావతి: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా ఏర్పాటుకు త్వరలోనే రూపురేఖలు స్పష్టమవనున్నాయి. ఎన్నికల ముందు ఈ జిల్లాను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా క్యాబినెట్ సబ్ కమిటీ మార్కాపురం జిల్లాను ప్రతిపాదించడంతో ఆ దిశగా చర్యలు వేగం పుంజుకున్నాయి. సమాచారం ప్రకారం, కొత్త జిల్లా మార్కాపురం కేంద్రంగా ఉండి, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలు ఇందులో ఉండనున్నాయి.

ఇక కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చడంపై కూడా చర్చ జరుగుతోంది. దీనిపై తుది నిర్ణయం నవంబర్‌ 7న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వెలువడే అవకాశముంది.