టీచర్లను హత్య చేసిన మావోయిస్టులు
ఇద్దరు ఉపాధ్యాయులను సోమవారం అర్ధరాత్రి అపహరించిన మావోయిస్టులు వారిని హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పీలూర్, టేకామేట గ్రామాల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న వినోద్ మద్దే(32), సురేశ్ మెటా(28)లను సోమవారం అర్ధరాత్రి సాయుధులుగా వచ్చిన మావోయిస్టులు అపహరించి తీసుకెళ్లారు. తర్వాత వారిని అతి దారుణంగా హత్యచేసి అదే గ్రామాల సమీపంలో మృతదేహాలను వదిలి వెళ్లారు.