ప్రారంభమైన మావోయిస్టు వారోత్సవాలు..అలర్ట్ అయిన పోలీసులు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నేటి నుంచి మవోయిస్టు వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ రోజు ప్రారంభం కానున్న ఈ వారోత్సవాలు వచ్చే నెల 3వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు పోలీసులు భారీగా బలగాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం వారు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మరోవైపు ముమ్మరంగా వాహనాలను కూడా తనిఖీలు చేస్తున్నారు. కాగా ఈ పోలీసు బలగాలు ప్రధానంగా వారపు సంతలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నిఘాలో భాగంగానే జి.మాడుగుల , పెదబయలు, ముంచంగిపుట్టు, జీకే వీధి, చింతపల్లి మండలాలతో పాటు పలుచోట్ల పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

