ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో కాంస్యం, చరిత్ర సృష్టించిన మను భాకర్-సరబ్జోత్ సింగ్ జోడి
పారిస్ ఒలింపిక్స్ 2024 4వ రోజున దక్షిణ కొరియాతో జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన మొదటి అథ్లెట్‌గా మను భాకర్ నిలిచింది. ఒకే ఒలింపిక్స్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. పురుషుల ట్రాప్, మహిళల ట్రాప్ క్వాలిఫికేషన్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. రోయింగ్‌లో బల్‌రాజ్ పన్వర్ పురుషుల సింగిల్స్ స్కల్స్ సెమీఫైనల్‌కు చేరుకోవాలని చూస్తున్నాడు. పూల్ Bలో అర్జెంటీనాతో జరిగిన థ్రిల్లింగ్ డ్రా తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఐర్లాండ్‌తో తలపడనుంది. ముగ్గురు భారతీయ బాక్సర్లు – అమిత్ పంఘల్, జైస్మిన్ లంబోరియా మరియు ప్రీతి పవార్ కూడా ఆడనున్నారు. ఈ సందర్భంగా ఇద్దరికీ ప్రధాని మోదీ X ద్వారా అభినంనదలు తెలిపారు.