Home Page SliderNational

‘మన్ కీ బాత్’ వందో ఎపిసోడ్

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రధాని మోదీ, రేడియోలో వివిధ అంశాలపై ప్రసంగించారు. ఇది మొదట అక్టోబర్ 3, 2014న ప్రసారం చేశారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ (DD) నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తున్నారు. 30 నిమిషాల నిడివిగల ఈ కార్యక్రమంలో 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో చర్చ మునుపటి ఎపిసోడ్‌లలో కనిపించిన అతిథులు, వారు సాధించిన పురోగతి గురించి PM వారితో సంభాషించారు. మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్‌లో, తోటి పౌరుల సేవ, సామర్థ్యాలు ఇతరులకు స్ఫూర్తినిచ్చాయన్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు మరొకరికి స్ఫూర్తిగా నిలుస్తాడన్నారు.