లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు ఇప్పట్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. కాగా ఈ కేసులో మనీష్ సిసోడియా ఇప్పటికే జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసును విచారించిన కోర్టు ఆయనకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మనీష్ సిసోడియా ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.