Home Page SliderNational

సుప్రీంకోర్టులో మణిపూర్ ‘మైతేయ్’ వర్గ పిటిషన్‌కు చుక్కెదురు…

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మణిపూర్ మహిళల ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మైతేయ్ జాతి వారు వేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. వారి పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. కుకీ జాతి మహిళలను నగ్నంగా ఊరేగించిన మైతేయ్ జాతి ఇది జాతి వైరం కాదంటూ తప్పించుకోవడానికే ఈ పిటిషన్ వేశారని కుకీ వర్గం వ్యాఖ్యానించింది. అక్కడ జరిగింది జాతుల మధ్య హింస కాదని, మాదకద్రవ్యాల సాగు వల్లే ఇలా జరిగిందని మైతేయ్ వర్గం పిటిషన్ వేసింది. దీనిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. నిజమైన ఆధారాలతో, వాస్తవాలతో పిటిషన్ దాఖలు చేయమని వారికి సూచించింది సుప్రీంకోర్టు. అక్కడ జరిగిన ఘటనపై సుమోటోగా విచారణను స్వీకరించింది సుప్రీంకోర్టు. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ స్వయంగా ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను మీరు చర్యలు తీసుకుంటారా.. మమ్మల్ని చూసుకోమంటారా అంటూ హెచ్చరించారు. రాజ్యాంగ విలువలను ఈ ఘటన పూర్తిగా కాలరాసిందని అభిప్రాయపడ్డారు. షెడ్యూల్ తెగల హోదా కోసం మెయితీ, కుకి తెగల మధ్య చెలరేగిన హింస కారణంగా ఈ దారుణం జరిగింది.  ఈ ఘటనపై పలు పిటిషన్లను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.