Horoscope TodayNational

తాను రాజీనామా చేయట్లేదన్న మణిపూర్ సీఎం

మణిపూర్‌లో జరుగుతున్న మారణహోమానికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై సీఎం బీరేన్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలని, తాను రాజీనామా చేయట్లేదని పేర్కొన్నారు. ఆయన ఈ మధ్యాహ్నం గవర్నర్‌ను కలువనున్న నేపథ్యంలో రాజీనామా వార్తలు వచ్చాయి. బీజేపీ హై కమాండ్ ఆయనను రాజీనామా చేయమని కోరిందని, దీనితో రాజీనామా చేస్తున్నట్లు సమాచారం వెలువడింది. దీనితో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనను రాజీనామా చేయవద్దంటూ కోరుతున్నారు. అయితే ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేయట్లేదని, శాంతిభద్రతలు అదుపులో ఉండేలా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.