Andhra PradeshHome Page Slider

మ్యానిఫెస్టో అంటే సీఎం జగన్..జగన్ అంటే మ్యానిఫెస్టో

ఏపీలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 98% పథకాలను అమలు చేసి చూపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకాన్ని ప్రజలకు అందించే దిశగా అడుగులు వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన ఏడాదికాలంగా వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టో పై సీఎం జగన్ తో సహా ఆ పార్టీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు.

మరో 10 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపద్యంలో ఇటీవల రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది. ఆ కార్యక్రమం వేదికగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తామని ఆ దిశగా మహిళలకు పలు వరాలను ప్రకటించింది. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను నమ్మొద్దు అంటూ మానిఫెస్టో అంటే జగన్ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలని ఆ పార్టీ నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది. ఆ దిశగానే గుంటూరులో ఆదివారం తొలి కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు నిర్వహించబోతున్నారు.