చిట్టి డబ్బుల కోసం మహిళా వేలును కొరికిన వ్యక్తి
చిట్టి డబ్బులు వసూలు విషయమై విచక్షణ కోల్పోయిన నిర్వాహకుడు ఓ మహిళా చేతి వేలును కొరికిన దారుణ ఘటన హైదరాబాద్ లోని మధు రానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… జవహర్ నగర్ లో హేమంత్, భార్య మమత అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే మమత చిట్టీల వ్యాపారం చేస్తుంది. ఆమెకు సుజిత అనే మహిళ రూ.30వేలు చిట్టీ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. చిట్టీ డబ్బుల విషయమై సుజిత ఇంటికి మమత, ఆమె భర్త హేమంత్ గొడవ పడ్డారు. ఈ ఘటనలో సుజిత తల్లి లత(45) మమత, హేమంత్ కు మధ్యలో రాగా విచక్షణ కోల్పోయిన హేమంత్ లత కుడి చెయ్యి చూపుడు వేలిని కొరికేశాడు. దీంతో మహిళ వేలు తెగిపడింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి హేమంత్ ను అరెస్ట్ చేశారు.