Home Page SliderTelangana

మూడేళ్లలో అందుబాటులోకి మామునూరు ఎయిర్ పోర్ట్

మామునూరు ఎయిర్ పోర్ట్ ను మూడేళ్లలో పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇవాళ వరంగల్ జిల్లాలో మంత్రి పర్యటించారు. స్థానిక ప్రజాప్రతి నిధులతో కలిసి ఎయిర్ పోర్టుల పరిశీలన చేశారు. గుంటూరు పల్లి, గడిపల్లి, నక్కలపల్లి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం గొప్పగా డెవలప్ మెంట్ అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి తదితరులు పాల్గొన్నారు.