కాంగ్రెస్ విషయంలో మమత బెనర్జీ వ్యాఖ్యలు వంద శాతం నిజమన్న కేటీఆర్
మోదీని గద్దె దించాలంటే యూపీలో కదా పోటీ చేయాల్సింది: కాంగ్రెస్‌కు కేటీఆర్ కౌంటర్
కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదన్న మమత వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నానన్నారు. ఇండియా కూటమి విషయంలో ఎదురుదెబ్బలతో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. యూపీ & గుజరాత్‌లో నేరుగా బీజేపీతో ముఖాముఖి తలపడే బదులుగా, ఇతర పార్టీలకు వ్యతిరేకంగా పోరాడటం ద్వారా కాంగ్రెస్ కూటమిని దెబ్బతీస్తోందని అన్నారు. కేసీఆర్ జీ, మమతా జీ, కేజ్రీవాల్ జీ, తిరు స్టాలిన్ వంటి బలమైన నాయకుల నేతృత్వంలోని శక్తులే బీజేపీని నిలువరించగలవు అనేది వాస్తవమన్నారు కేటీఆర్. బీజేపీకి కాంగ్రెస్ ఇప్పుడు సరైన ప్రత్యామ్నాయం కాదన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా అనుమానమే: మమతా బెనర్జీ
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదని, అది కేవలం ఫోటో షూట్ కార్యక్రమం మాత్రమేనన్నారు బెంగాల్ సీఎం మమత బెనర్జీ. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా సాధించగలదన్న సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు. హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లో బీజేపీని.. కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలు కొనసాగుతున్నాయని, సమస్యను పరిష్కరిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటన తర్వాత మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లోని ఆరు జిల్లాల నుంచి సాగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను మమత తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్రంలో మైనారిటీ ఓట్లను విభజించే లక్ష్యంతో వలస పక్షుల… కేవలం ఫోటోలకు పోజులివ్వడానికే పరిమితమవుతుందన్నారు. కాంగ్రెస్ 300 స్థానాల్లో… బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న దేశమంతటా పోటీ చేయాలని తాను ప్రతిపాదించానని… కానీ వారు పట్టించుకోలేదన్నారు మమత బెనర్జీ. ఇప్పుడు ముస్లిం ఓటర్లను రెచ్చగొట్టడానికి రాష్ట్రానికి రాహుల్ వచ్చారని దుయ్యబట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు సాధిస్తాందా… అనే సందేహం తనకు ఉందన్నారు. రాష్ట్ర బకాయిలను కేంద్రం క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో జరిగిన ధర్నాలో ప్రసంగిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి తమ పార్టీ సుముఖత వ్యక్తం చేసినట్లు బెనర్జీ పునరుద్ఘాటించారు, అయితే అది గ్రాండ్-ఓల్డ్ పార్టీ అందుకు సిద్ధంగా లేదన్నారు. ఒంటరిగా పోరాడి, బెంగాల్‌లో బిజెపిని ఓడిస్తామన్నారు.
