Home Page SliderNational

ఇకపై హత్యాచార ఘటనలకు చెక్..బెంగాల్లో కొత్త బిల్లుకు మమత ఆమోదం

పశ్చిమబెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచారం లాంటి ఘటనలు ఇంకెన్నడూ జరగాలంటే భయపడేలా చేస్తామన్నారు సీఎం మమతా బెనర్జీ. మంగళవారం అసెంబ్లీలో హత్యాచార నిరోధానికై అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లును బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి చర్చ అనంతరం ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ బిల్లు చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి మమత వ్యాఖ్యానించారు. ఇకపై హత్యాచార ఘటనలకు చెక్ పడుతుందన్నారు. ఈ బిల్లు ద్వారా కేంద్ర చట్టంలోని లోపాలను సవరించామన్నారు. సత్వర విచారణ, బాధితులకు న్యాయం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం అన్నారు. దీనికోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మానవాళికి శాపంగా మారిన ఇలాంటి దారుణాలు జరగకుండా సామాజిక సంస్కరణలు ప్రవేశపెడతామన్నారు. యూపీ, గుజరాత్‌లలో జరిగిన ఉన్నావ్, హాథ్రస్ వంటి కేసులలో న్యాయం గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదని, కానీ బెంగాల్‌లో మహిళలకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.