Home Page SliderNationalNewsPolitics

ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే సంచలన లేఖ

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తప్పనిసరి అని మల్లికార్జున ఖర్గే తెలిపారు. స్పీకర్ తర్వాత లోక్‌సభలో రెండో అత్యున్నత స్థానం డిప్యూటీ స్పీకర్‌దేనని మల్లికార్జున ఖర్గే గుర్తుచేశారు. మొదటి నుంచి పదహారో లోక్‌సభ వరకు అన్ని లోక్‌సభల్లో డిప్యూటీ స్పీకర్ ఉన్నారని వివరించారు. కానీ 17వ, 18వ లోక్‌సభల్లో ఆ పదవి ఖాళీగా ఉందని చెప్పుకొచ్చారు మల్లికార్జున ఖర్గే. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం సంప్రదాయమని చెప్పారు. ఈ స్థానం ఖాళీ గా ఉండటం రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిపారు. వెంటనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలంటూ ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.