మల్లారెడ్డి టైమ్ మిషన్ జర్నీ..వీడియో వైరల్..
బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఎక్స్ ఖాతా వేదికగా టైమ్ మెషిన్ అంటూ ఓ ఏఐ వీడియో పోస్ట్ చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రమోషన్స్ లో భాగంగా ఏఐ వీడియో క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. దేశ భవిష్యత్ నిర్మాణానికి మంచి విద్యాసంస్థలు స్థాపించాలని బుద్ధుడు, చాణుక్యుడు, మదర్ థెరిస్సా, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం వంటి మహనీయులు చెప్పినట్లుగా ఏఐ వీడియో రూపోందించారు. వీడియోలో చూపించిన ప్రకారం.. మల్లారెడ్డి టైమ్ మెషిన్ లో వెనకటి కాలానికి వెళ్లారు. నాటి కాలం మహానీయులు గౌతమ బుద్ధుడు, పీఠాధిపతులు, చాణక్యుడు, స్వామి వివేకానంద, మధర్ తెరిస్సా, మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ వంటి వారిని కలిశారు. మహానీయుల ఆశయాలు నిలబెడతానని, దేశంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం నెలకొల్పుతానని వీడియోలో మల్లారెడ్డి భరోసా ఇస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.