Home Page SliderTelangana

డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి అదిరిపోయే స్టెప్పులు..

ఆయన ఏది చేసినా, ఏం మాట్లాడినా వైరల్ అవ్వాల్సిందే. ఆయనే ఎవరంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. 70 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఉంటారు. తాజాగా ఆయన వీడియో మరోసారి వైరల్ గా మారింది. తన మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ తో ఇరగదీశారు. వైట్ కలర్ సూటుబూటులో మరికొందరితో కలిసి ఆయన అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ పెళ్లి సంగీత్ కార్యక్రమంలో ఆయన ‘డీజే టిల్లు’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వయసులో కూడా మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.