Home Page SliderTelangana

పేదల జోలికొస్తే ఊరుకోం

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 453, 454లో 446 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా సుమారు 355 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించేందుకు సర్వే నిర్వహించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఇవాళ దుండిగల్ వార్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా ఎంపీ ఈటల ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అలాట్ చేసిన భూములను ఎప్పుడు పడితే అప్పుడు లాక్కునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజా అవసరాల కోసం వాడుకోవాల్సి వస్తే రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.