Home Page SliderNational

సూపర్‌స్టార్ మహేష్ సినిమాలో విలన్‌గా మలయాళ హీరో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో “SSMB29” సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి,మహేష్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారనే న్యూస్ బయటకు వచ్చింది. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది. కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ సలార్ మూవీలో వరదరాజ మన్నార్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.