తప్పులు మీద తప్పులు చేస్తున్నారు
ఒక ఘటన జరిగితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో ఘటనను బలిపెట్టడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది.మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లు…నెలకో ఘటనను ప్రణాళికాబద్దంగా ఎంచుకుని కార్యనిర్వహణ చేస్తున్నట్లు అర్ధమౌతుంది.తాజాగా తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో విచారణకు ఆదేశించకుండానే ఎస్పీ సుబ్బారాయుడిని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.అంతే కాదు..ఆయన స్థానంలో ఆల్రెడీ వర్క్ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుకే మళ్లీ నియామకం ఇచ్చారు.ఇంతటితో ఆగలేదు….వేటు పడిన ఎస్పీ రాయుడికి ఇదే తిరుపతిలో ఎర్రచందనం టాస్క్ పోర్స్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.దీంతో అసలు కూటమి పాలన ఎటు పోతుందో అని ప్రజలు తలలుబాదుకుంటున్నారు.